శ్రీశైలం: పంటల్లో విత్తన శుద్ధి ఎంతో కీలకమం :మహానంది ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా.హేమాద్రి
పంటల్లో విత్తన శుద్ధి ఎంతో కీలకమని మహానంది ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా.హేమాద్రి రైతులకు సూచించారు. శనివారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో పసుపు పంటలో విత్తన శుద్ధి,సాగు పద్ధతులపై రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఉద్యానశాఖ అధికారి మాట్లాడుతూ రసాయనిక విత్తన శుద్ధిలో మెటలాక్సిల్, మాంకోజెబ్ మందును లీటరు నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలని సూచించారు. విత్తన కాండాలపై పొలుసు పురుగులు ఉన్నట్లయితే ప్రొఫెనోఫాస్ 50 ఈసీ మందును లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలిపి శుద్ధి చేయాలని తెలిపారు.