మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం లక్ష్మీపురం గ్రామంలో 5 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుందని ఆలోచించిన విమల అనే మహిళ..
మహబూబాబాద్ మండలం లక్ష్మీపురం (బి) గ్రామంలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని, దీనిని అడ్డుకున్న చారి హరీష్ భార్య చారి విమల మంగళవారం మధ్యాహ్నం 3:00 లకు ఆరోపించారు. తన భర్త అధికారులకు ఫిర్యాదు చేయడంతో, అధికార పార్టీ నేతలు 14.09.2025న ఒక గిరిజన మహిళపై అక్రమ కేసు బనాయించారని ఆమె తెలిపారు. 15.09.2025న విచారణకు వచ్చిన అధికారులు సాక్షులను ప్రశ్నించగా, వారు ఏమీ చూడలేదని చెప్పినప్పటికీ అబద్ధపు సాక్ష్యాలతో కేసు నమోదు చేసే ప్రయత్నం జరుగుతోందని విమల ఆరోపించారు.