ఆత్మకూరు పట్టణంలో డీజిల్ కొరకు బారులు తీరిన వాహనాలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
ఆత్మకూరు పట్టణంలో డీజిల్ కొరత రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ పూర్తిగా అయిపోవడంతో బంకులను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పట్టణంలోని ఒకే ఒక పెట్రోల్ బంకులో రాత్రి సమయంలో డీజిల్ సరఫరా కావడంతో వాహనాలు భారీగా బారులు తీరాయి. ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, ఇతర వాహనాలు కిలోమీటర్ల మేర క్యూల్లో నిలబడి డీజిల్ కోసం వేచిచూశాయి.పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సమక్షంలోనే బంకు నిర్వాహకులు వాహనాలకు డీజిల్ సరఫరా చేశారు