వికారాబాద్: ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో భాగంగా కులక్చర్లలోని రెండు పరీక్ష కేంద్రాల్లో కాపీ చేస్తున్న 9 మంది విద్యార్థుల డీబార్
ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో భాగంగా గురువారం కులక్చర్లలోని రెండు పరీక్ష కేంద్రాల్లో కాపీ చేస్తున్న 9 మంది విద్యార్థులను తెలంగాణ ఇంటర్ బోర్డు డిబార్ చేసినట్లు వికారాబాద్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ తెలిపారు. జిల్లాలో జనరల్ కోర్సుల్లో 5124 మంది విద్యార్థులకు గాను 5016 మంది హాజరయ్యారని, ఒకేషనల్ కోర్సులలో 1273 మంది విద్యార్థులకు 1228 మంది హాజరయ్యాని పేర్కొన్నారు.