వికారాబాద్: స్కూలుకు వెళ్లాలని తల్లి మందలించడంతోమద్గుల్ చిట్టం పల్లిలో విద్యార్థిని ఆత్మహత్య.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది, స్కూల్ కు వెళ్లాలని తల్లి మందలించడంతో ఇంట్లోకి వెళ్లి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టం పల్లిగ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దన్నారం శ్రీవాణి అదే గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది,శ్రీవాణి తండ్రి గతంలో మరణించడంతో తల్లి ఇద్దరు పిల్లలను వ్యవసాయం చేస్తూ చదివిస్తుంది. స్కూలుకు వెళ్లాలని తల్లి మందలించడంతో ఇంట్లోకి వెళ్లి గురువారం ఉదయం ఉరివేసుకున్న సంఘటన జరిగింది.