వికారాబాద్: ఒకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రామయ్యగూడకు చెందిన పావనిని సన్మానం చేసిన గ్రామస్థులు
రామయ్యగూడకు చెందిన పావని అనే యువతి ఒకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. మహిళా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆమెను గ్రామస్థులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏ మహిళ అయినా ఉన్నతంగా ఎదగాలంటే ఇంట్లోని కుటుంబసభ్యుల సహకారం ఉంటే ఎంతటి స్థాయికైనా ఎదగవచ్చునని ఆమె తెలిపారు.