జంగారెడ్డిగూడెం త్రివేణి కాలేజ్ సెంటర్‌లో మహిళా పోలీస్ మెడలో బంగారు గొలుసును అపహరించిన దుండగుడు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం త్రివేణి కాలేజీ దగ్గర చైన్ స్నాచింగ్. ఏడవ సచివాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఎస్తేరు రాణి సర్వే నిమిత్తం సాయంత్రం కాలంలో సర్వరు స్పీడ్ గా ఉంటుందని సర్వే చేయడానికి స్కూటీ పైన వెళుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి తన మెడలో ఉన్న పుస్తెలతాడును బంగారపు గొలుసు లాక్కొని వెళ్లడంతో ఆమె కింద పడిపోగా ఆమె మెడకు గాయాలు అయ్యాయి. బాధితరాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.