కోడుమూరు: 13న గూడూరులో జరిగే హిందూ సమ్మేళ సభ ఏర్పాట్లు ముమ్మురం: ప్రముఖ్ డమాం సురేష్
డిసెంబర్ 13న గూడూరులో జరుగుతున్న హిందూ సమ్మేళ సభకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నట్లు నిర్వహణ ప్రముఖ్ డమాం సురేష్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ హిందూ సమ్మేళన సభ భారీ ఎత్తున జరుగుతున్నట్లు తెలిపారు. సభా ప్రాంగణంలో పరిశుభ్రత, త్రాగునీరు, మొబైల్ టాయిలెట్ల ఏర్పాట్ల పనులు తుది దశకు చేరాయన్నారు. మున్సిపల్ కమిషనర్ సభాస్థలిని పరిశీలించారని, అవసరమగు సౌకర్యాలపై హామీ ఇచ్చారని డమాం సురేష్ తెలిపారు.