భీమిలి: గంటా శ్రీనివాసరావు నివాసంలో కీలక రాజకీయ భేటీ: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చ
విశాఖ ఎంవీపీ కాలనీలో గంటా శ్రీనివాసరావు నివాసంలో కీలక సమావేశం జరిగింది. జిల్లా ఇంచార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీడీపీ నేత చోడే వెంకట పట్టాభిరామ్ హాజరై జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అంశాలపై చర్చించారు.