అమలాపురం: కోనసీమ జిల్లాకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు - స్వచ్ఛతలో జిల్లా సత్తా
అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు లభించాయి. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి, ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ అవార్డులను అందజేశారు. స్వచ్ఛతలో రాష్టంలోనే అగ్రస్థానమే లక్ష్యమని అధికారులు తెలిపారు.