గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లాలో వరుస బైక్ చోరీలు: చిన్నతయ్యూరులో అర్ధరాత్రి వాహనం మాయం
చిత్తూరు జిల్లా ఎస్.ఆర్.పురం మండలం చిన్నతయ్యూరు గ్రామంలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనం చోరీ జరిగింది. మండలంలో వరుసగా వాహనాలు మాయమవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిందితులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.