పామూరు: దేశ ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీపై అచంచల విశ్వాసం ఉంది: బిజెపి జిల్లా కో కన్వీనర్ కొండిశెట్టి వెంకట రమణయ్య
Pamur, Prakasam | May 4, 2026
పామూరు: దేశ ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీపై అచంచల విశ్వాసం ఉందని, అందుకు తాజా నిదర్శనమే ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి గణ విజయం సాధించిందని బిజెపి జిల్లా కో కన్వీనర్ కొండిశెట్టి వెంకట రమణయ్య అన్నారు. మూడు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో పామూరు పట్టణంలో వెంకటరమణయ్య ఆధ్వర్యంలో బిజెపి, ఎన్డీఏ కూటమి నాయకులు బాణసంచా కాల్చి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణయ్య మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రధాని మోడీ నేతృత్వంలో కూటమి ఘనవిజయం సాధిస్తుందన్నారు.