అంతర్రాష్ట్ర బైకుల దొంగ అరెస్ట్ 27 బైకులు 1100 గ్రాముల గంజాయి స్వాధీనం
Ongole Urban, Prakasam | Mar 31, 2026
అంతర రాష్ట్ర బైకుల దొంగను ప్రకాశం జిల్లా ఒంగోలు వన్ టౌన్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి పట్టుకున్నారు. నిందితుడి వద్దనుండి వివిధ జిల్లాలకు చెందిన 10 లక్షలు విలువైన 27 మోటార్ బైకులను, అమ్మటానికి సిద్ధం చేసిన 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు డి.ఎస్.పి తెలిపిన వివరాల ప్రకారం కొత్తపట్నం మండలం పాదర్తికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి గత కొంతకాలంగా బైక్లను దొంగలించటమే వృత్తిగా గడుపు తున్నాడు. ఇప్పటికే ఇతనిపై ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలలో కూడా కేసులు నమోదైన్నాయి.