నిర్మల్: జిల్లాలో భారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
Nirmal, Nirmal | Sep 21, 2025 జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లే పరిస్థితుల్లో వాటిని దాటే ప్రయత్నం చేయరాదని కలెక్టర్ సూచించారు. తక్కువ ఎత్తులోని ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.