నిర్మల్: జిల్లాలోని అటవీ,గిరిజన ప్రాంతాల పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి:జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
Nirmal, Nirmal | Sep 19, 2025 జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంతాల పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన అంశాలపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖల ద్వారా మంజూరైన పనులపై సమగ్ర సమీక్ష జరిపారు. ఇప్పటికే చేపట్టిన పనుల పురోగతిని, అటవీ, రెవెన్యూ శాఖల అనుమతుల మంజూరు స్థితిని వివరంగా అధికారుల నుండి తెలుసుకున్నారు.