శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలో బ్రేక్ దర్శనాల్లో కీలక మార్పులు చేపట్టిన చైర్మన్ రమేష్ నాయుడు, EO శ్రీనివాస్ రావు
శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవస్థానంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బ్రేక్ దర్శన విధానంలో కీలక మార్పులు చేపట్టినట్లు దేవస్థాన చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శని, ఆది, సోమవారాల్లో ఉదయం మనమిత్ర వాట్సాప్, ఆన్‌లైన్ ద్వారా స్పర్శ దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ప్రముఖులు స్వయంగా విచ్చేసిన సందర్భంలో మాత్రమే ఉదయం స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు ఉదయం స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేసి, అవకాశం ఉన్న మేరకు రాత్రి అనుమతిస్తామన్నరు