యూరియా ఎరువు కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..గూడెం కొత్తవీధి మండల వ్యవసాయ అధికారి డీ.గిరిబాబు
యూరియా ఎరువు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గూడెం కొత్తవీధి మండల వ్యవసాయ అధికారి డీ.గిరిబాబు రైతులకు సూచించారు. ఆదివారం సాయంత్రం గూడెం కొత్తవీధి మండలానికి 12 టన్నుల యూరియా లోడు వచ్చిందన్నారు. దామనాపల్లి రైతు సేవా కేంద్రానికి-6 టన్నులు, వంచుల-6 టన్నుల చొప్పున పంపించామన్నారు. రేపటి నుంచి ఆయా చోట్ల రైతులకు యూరియా పంపిణీ చేస్తామన్నారు. అలాగే మంగళవారం మరో 20 టన్నుల యూరియా మండలానికి వస్తుందన్నారు. రైతులు ఆందోళన చెందవద్దన్నారు.