కనిగిరి మండల విద్యాశాఖ అధికారులపై ఏపీ టీచర్స్ గిల్డ్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ చేసిన ఆరోపణలు అసత్యాలని టీచర్స్ గిల్డ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం వి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. కనిగిరిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ... ఎంఈఓ లు ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని, జీతాల బిల్లుల విషయంలో ఎవరిని ఇబ్బందులు పెట్టలేదన్నారు. జిల్లా కమిటీ దీనిపై ఖండన ఇవ్వాలని కోరుతున్నామన్నారు.