నిడదవోలు: వంగవీటి రంగా విగ్రహాల తొలగింపుతో ఉండ్రాజవరంలో ఉద్రిక్తత, 144 సెక్షన్ అమలు
నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో వంగవీటి రంగా విగ్రహాల తొలగింపుతో ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణ వాతావరణం నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యాలయంలో ఉన్న విగ్రహాలను పోలీసుల సమక్షంలో నాయకులు పరిశీలించారు.