గన్నవరం: ఉంగుటూరులో 15వ రోజుకు చేరిన VRAల సమ్మె: రోడ్డుపైనే వంటా-వార్పు
కృష్ణా జిల్లా ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట VRAల నిరవధిక సమ్మె 15వ రోజుకు చేరింది. ఉంగుటూరు, గన్నవరం, బాపులపాడు మండలాలకు చెందిన వీఆర్ఏలు కలిసి వంటా-వార్పు కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు.