గుంటూరు: వాహనమిత్ర పథకంలో కొన్ని నిబంధనలను ప్రభుత్వం తొలగించాలి : ఆటో యూనియన్ గుంటూరు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్
Guntur, Guntur | Sep 15, 2025 ఎన్నికల హామీలో భాగంగా వాహనమిత్ర సాయాన్ని దసరా నాటికి అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమని ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ ఈ సాయం కోసం కొన్ని నిబంధనలు విధించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఆటో యజమానులతో పాటు కార్మికులకు కూడా వాహనమిత్ర సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.