సంగారెడ్డి: సంగారెడ్డి మెడికల్ కళాశాలలో క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి : జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో క్రీడా మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. కళాశాల ప్రాంగణంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన క్రీడా మైదానం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులకు సూచించారు. మంగళవారం సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో పర్యటించి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కళాశాల విద్యార్థులకు విద్యుత్ తో పాటు క్రీడాల్లోనూ రాణించేలా ప్రోత్సహించేందుకు ఆధునిక సౌకర్యాలతో కూడిన క్రీడా మైదానం ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.