చెన్నూరు: నూతనంగా 5 కొత్త బస్ సర్వీసులను ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి నూతనంగా 5 కొత్త బస్ సర్వీసులను కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.చెన్నూర్ నుండి హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాలకు నూతన సర్వీసులను ఆర్టీసీ నడిపించనున్నాయి. మంత్రి వివేక్ మాట్లాడుతూ చెన్నూర్ ప్రజల చీర కాల వాంఛ అయిన బస్ సర్వీసులను ప్రారంభించడం జరిగిందని, చెన్నూర్ పట్టణంలో బస్ డిపో కావాలని కోరుతున్నారు. బస్ డిపో కోసం ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడడంజరిగిందనీ, డిపోకు సంబంధించిన భూ వివాదం ఉన్నందున డిపో పనులు నిలిచి పోయాయని తెలిపారు.