పీ-4 సర్వే వేగవంతం చేయాలి: కొయ్యూరులో ఎంపీపీ బడుగు రమేశ్, ఎంపీడీవో డీ.బాలమురళికృష్ణ
పీ-4 సర్వేను వేగవంతం చేయాలని కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేశ్, ఎంపీడీవో డీ.బాలమురళికృష్ణ సూచించారు. గురువారం మధ్యాహ్నం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పేదల సాధికారత కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. సర్వే, గ్రామ సభల ద్వారా పేదలను గుర్తించి, నమోదు చేయాలని సూచించారు. పేదరికం లేని సమాజాన్ని తయారు చేసి, ఆర్ధిక అసమానతలను రూపు మాపేందుకు కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.