కొడిమ్యాల: కొండగట్టు గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు
జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,కొండగట్టు గ్రామ శివారులో పెట్రోల్ పంపు సమీపంలో,సుమారు 50 55 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది,అయితే ఈ విషయాన్ని ముత్యంపేట గ్రామ సెక్రెటరీ కి తెలపడంతో సెక్రటరీ పోలీసులకు సమాచారం అందజేశారు, మధ్యాహ్నం నాలుగు గంటల యాభై నిమిషాలకు ఘటన స్థలానికి చేరుకున్న మల్యాల పోలీసులు ముత్యంపేట గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు,గుర్తుతెలియని మహిళా మృతదేహం లభించినట్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు,ఇంకా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,