ముమ్మిడివరం: కొత్తలంకలో వైభవంగా అయ్యప్ప, భవానీ దీక్షాధారుల భిక్షా కార్యక్రమం
ముమ్మిడివరం మండలం కొత్తలంకలో ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి వారి సేవాసమితి ఆధ్వర్యంలో భిక్షా కార్యక్రమం మరియు నూతన మందిరాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగాయి. గురుస్వామి కముజు శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.