అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిటి పెన్నిధి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కర్నూలు రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆదివారం టీడీపీ శ్రేణులు పాలాభిషేకం చేసి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుత్తి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ దివంగత ఎన్టీ రామారావు పేదల పాలిటి పెన్నిధిగా నిలిచి రెండు రూపాయలకే కిలో బియ్యం లాంటి అనేక మంచి పథకాలను అందించారన్నారు.