వెలుగోడు పట్టణంలో ఎనిమిదేళ్ల చిన్నారిపై ఒక కామాంధుడు అత్యాచార యత్నం. పరారీలో నిందితుడు
వెలుగోడు పట్టణంలో ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. అభం శుభం తెలియని చిన్నారిని ఆ కామాంధుడు తన ఇంట్లోకి పిలుచుకొని చిన్నారి ప్రవేట్ పాట్లను టచ్ చేస్తూ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అంతలోనే చిన్నారి కన్నతల్లి తమ గారాల బిడ్డ కనబడలేదని అనుమానం వచ్చి కామాంధుడున్న ఇంటిని తలుపుతట్టగా అసలు విషయం బయటకు పొక్కింది. ఇంటి పక్కనే ఉన్న హఫీజ్ అనే 54సంవత్సరాల వ్యక్తి మైనర్ బాలికను ఆడుకునేందుకు ఇంటికి పిలిచి ప్రైవేట్ పార్ట్ లు ముట్టుకున్నట్లు మైనర్ బాలిక కన్నతల్లితో చెప్పినట్లు తెలిసింది. ఆలోపే విషయం పసిగట్టిన నిందితుడు ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని పరారయ్యాడు.