బోధన్: కల్లూరు కిలో గ్రామ ఫ్రెండ్స్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
బోధన్ మండలం లోని కల్దుర్కి గ్రామ ఫ్రెండ్స్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభించారు.గత 18 సంవత్సరాలుగా శరన్నవ రాత్రి ఉత్సవాలు నిర్వహింస్తున్నట్లు వివరించారు.18వ వార్షికోత్సవం సందర్భంగా 9అవతారాల అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించారు. గ్రామంలో ప్రజలు సుఖసంతోషాలతో పాడి పంటలతో సుఖంగా ఉండాలని అమ్మవారిని పూజించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరోజు వివిధ రూపాలలో కొలువుదీరిన అమ్మవారిని ఒక్కొక్క రూపంలో ఒక్కో అవతారంలో విశిష్ట పూజలు అందుకోవడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.