కొండపి: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మారిటైం బోర్డు ఛైర్మన్
టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న అంతర్గత సిమెంట్ రోడ్డుకు మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ..ఎస్సీల సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.