కోదండ రామస్వామి దేవస్థానం స్థలం ఆక్రమించడానికి ప్రయత్నించిన ప్రైవేటు వ్యక్తులు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య పిఏకు ఫిర్యాదు
హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కోడూరు తోపులో వెలిసిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానం స్థలాన్ని కొంతమంది అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని హద్దులు ఏర్పరచుకోవడం జరిగింది అదేవిధంగా ఇదే స్థలంలో శ్రీరామనవమికి పరుష మరియు తేరు జరుగును ఇలాంటి స్థలాన్ని ఆక్రమించుకోవడంతో కోడూరు గ్రామస్తులు తీవ్రంగా ఆవేదన చెంది హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య దృష్టికి తీసుకువెళ్లగా వీరయ్య స్పందిస్తూ దేవస్థానం స్థలం అన్యాక్రాంతం కాకుండా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఏవి రమణ పాల్గొన్నారు