ప్రొద్దుటూరు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రిలే నిరాహార దీక్షలు చేస్తూ కొత్త డ్రామాలు చేస్తున్నారు: నల్లబోతుల నాగరాజు
Proddatur, YSR | Nov 5, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అబద్దాలకోరు అంటూ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎగ్జిబిషన్ బకాయిలు ఎగర కొట్టారంటూ మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి రిలే నిరాహార దీక్ష చేస్తూ కొత్త డ్రామా సృష్టిస్తున్నారని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉంటూ మీ అనుచరులు ఎగ్జిబిషన్ కు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించ కుండా ఎగరగొట్టాలన్నారు.