మనోహరాబాద్: దండుపల్లిలోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్
దండుపల్లిలోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి లోని ఎరువుల దుకాణాన్ని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తనిఖీ చేశారు. ఆయన ఎరువుల దుకాణంలో ఎరువుల నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. స్టాక్ వివరాలు, రిజిస్టర్ల నమోదు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసిన రసీదులను భద్రంగా దాచాలని రైతులకు ఆయన సూచించారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని వినయ్ కుమార్ హెచ్చరించారు. ఈ తనిఖీలో వ్యవసాయ అధికారి స్రవంతి కూడా పాల్గొన్నారు.