శ్రీశైలం: శ్రీశైలం క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం దేవస్థాన పరిధిలో ఎక్కడ చూసినా ఖాళీ మద్యం బాటిల్ దర్శనం
శ్రీశైలంలో అధికారుల నిర్లక్ష్యంతో మద్యం ఏరులై పారుతుంది దేవస్థాన పరిధిలో ఎటు చూసినా ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యంతో వరస అపచార ఘటనలు చోటు చేసుకోవటంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. శ్రీగిరిపై ఏం జరుగుతోందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వెంట కాళీ మద్యం సీసాలు కనిపించడంతో క్షేత్ర పరిధిలోకి టోల్ గేట్ దాటి మద్యం బాటిల్స్ ఎలా వస్తున్నాయని, నిర్లక్ష్యం వీడి అధికారులు తగు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.