హిందూపురం పట్టణంలోని లేపాక్షి రోడ్ లో ఓ ఫాన్సీ స్టోర్ లో సెల్ఫోన్ చోరీ చేసిన అగంతకుడు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణం లేపాక్షి రోడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న నిహంత్ ఫ్యాన్సీ స్టోర్ లో ఓ అగంతకుడు సెల్ఫోన్ చోరీకి పాల్పడ్డాడు. ఫ్యాన్సీ స్టోర్లో గాజులు కొనుగోలు చేసేందుకు వెళ్లి దుకాణంలో పనిచేసే అమ్మాయితో గాజులు చూపించమని అడగగా అమ్మాయి గాజులు చూపించేందుకు వెనక్కి తిరగడంతో అగంతకుడు సెల్ ఫోను చోరీ చేశాడు. దుకాణంలో కొనుగోలు చేసేందుకు వచ్చినట్టు నటించి చోరీకి పాల్పడ్డాడు. దుకాణ యజమానులు హిందూపురం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.