సంగారెడ్డి: బిసి రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి తెలపాలి, ఆమోదించాలి : టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వైఖరి తెలుపాలని మొండివైఖరి వీడి ఆమోదించాలని టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మలారెడ్డి ఆరోపించారు. శనివారం సంగారెడ్డిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని అన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసినట్లు ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చితేనే అమలు అవుతాయని నిర్మలారెడ్డి పేర్కొన్నారు. వెంటనే బిజెపి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.