అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని వజ్రకరూరు ఉరవకొండ విడపనకల్లు మండలాల్లో శనివారం ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా మలేరియా అధికారి డి ఓబులు ఆదేశాల మేరకు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నందు మూడు మలేరియా వర్కర్ల టీమ్ లను పెట్టి మలాతీయన్ ఎన్ డబ్ల్యూ డిపి ద్రావణాన్ని పిచికారి చేయించడం జరిగిందని ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు సంక్రాంతి సెలవులు ఉన్నందువల్ల ఈనెల 19 లోగా అన్ని వసతిగృహాలకు క్రిమిసంహారక మందులను పిచికారి చేయించడం జరుగుతుందన్నారు.