అదిలాబాద్ అర్బన్: పట్టణంలో జర్నలిస్టులకు, ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలను ప్రారంభించిన డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సీఎం కప్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి క్యారం ఆడారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే ఉద్యోగులు, జర్నలిస్టులు క్రీడలకు సైతం సమయం కేటాయించాలని సూచించారు.