విద్యార్థులు చదువుతో సమానంగా క్రీడల్లో కూడా రాణించినప్పుడే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని డీఎస్డీఓ భూపతిరావు, రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఒలింపిక్ సంఘం సీఈవో విజయ్ కుమార్ అన్నారు.కర్నూలు స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపిక పోటీలను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 19 నుంచి 21 వరకు కర్నూలు జరగనున్న 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.