ప్రజలకు కనబడుతున్న మెడికల్ కాలేజీలు టీడీపీ వారికి కనిపించలేదు వారికి ఏమైనా పచ్చకామెర్ల - మడకశిర ఎస్సీ సెల్ నాయకుడు
ప్రజలకు కనబడుతున్న మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు కనపడలేదంటే వారి కళ్ళకు పచ్చకామెర్లు ఏమైనా వచ్చాయా అని మడకశిర కు చెందిన వైకాపా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి అన్నారు. పుట్టపర్తి వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ మంత్రి సవితమ్మ సైతం నిర్మాణం పూర్తి కానిచోట నిలబడి మెడికల్ కాలేజీ నిర్మాణం చేయలేదంటూ విమర్శలు చేస్తుందని గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సైతం నిర్మాణం పూర్తి అయ్యాయని ప్రజలకు కనబడుతున్న మెడికల్ కాలేజీ వీరికి ఎందుకు కనపడలేదు అర్థం కాలేదు అన్నారు.