పూతలపట్టు: కానిపాకం వినాయక బ్రహ్మోత్సవాలు: శనివారం పుష్ప పల్లకి సేవకు ముమ్మరంగా ఏర్పాట్లు
కానిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం పుష్ప పల్లకి సేవ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు పల్లకిని పుష్పాలతో అలంకరించే పనులను వేగవంతం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.