పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 121 ఫిర్యాదులు: జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజతో కలిసి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.