పటాన్చెరు: జిన్నారం పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర సరుకుల పంపిణీ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండల కేంద్రంలో పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు బిజెపి నాయకుడు పూడూరు సుధాకర్ నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. గత నాలుగైదు నెలలుగా జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు ప్రతినెల జీతాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.