జగ్గంపేట: గోకవరం: చెరువుల్లో గుర్రపుడెక్కతో ఇబ్బందులు పడుతున్న రైతులు
గోకవరం మండలంలోని 15 గ్రామ పంచాయతీల పరిధిలో ఇరిగేషన్ చెరువుల్లో పెరిగిన గుర్రపుడెక్క, తూటికాడలను తొలగించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. వీటి వల్ల సాగునీరు అందక చివరి భూములకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు.