శ్రీశైలం: వెనుగోడు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ప్రజాదర్బార్ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ , ఎస్పీ, ఎమ్మెల్యే
వెలుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీశైలం నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక – ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచింది.ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌తో పాటు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన అధికారులు, సమస్యలను శాఖల వారీగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రజల సమస్యలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా ఒకే వేదికపై పరిష్కరిస్తామన్నారు.