నందికోట్కూరు: ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులను బెదిరిస్తే కఠిన చర్యలు నందికొట్కూరు టౌన్ సిఐ మురళీధర్ రెడ్డి
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని నందికొట్కూరు టౌన్ సిఐ మురళీధర్ రెడ్డి శుక్రవారం తెలిపారు, ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు నాయకులు సహకరించాలని కోరారు, ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు సమాచారం అందిన వెంటనే ఎలాంటి ఆటంకాలు లేకుండా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకునేందుకు తగిన ఏర్పాటు చేస్తామని భరోసా కల్పించారు, ఈ కార్యక్రమంలో ఎస్సైలు చంద్రశేఖర్ సురేష్ బాబు పాల్గొన్నారు