'దేవగుడి' సినిమా ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా నచ్చుతుందని దర్శకుడు, నిర్మాత రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దరు స్నేహితుల ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 19న విడుదల కానుందని తెలిపారు. రాయలసీమలో ఫ్యాక్షన్ కాకుండా, మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథతో సినిమా వస్తోందని, ఇది రియల్ జరిగే ఒక ఇన్సిడెంట్ ఆధారంగా తీసుకుందని చెప్పారు.