సామర్లకోటలో పలుఅభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన, ఎమ్మెల్యే రాజప్ప మరియు డిసిసిబి చైర్మన్ రామస్వామి.
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డిసిసిబి చైర్మన్ లు. సామర్లకోట అయోధ్య రామాపురంలో నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయ చినరాజప్ప, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు ఆదివారం ప్రారంభించారు. సత్తెమ్మ తల్లి ఆలయ వద్ద నూతనంగా నిర్మించిన ముఖద్వారం, వ్రతాల షెడ్డును కూడా ఎమ్మెల్యే రాజప్ప ప్రారంభించారు. ప్రాచీన చరిత్ర కలిగిన స్వయంభు శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని ఎమ్మెల్యే చినరాజప్ప, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు తెలిపారు.