కొండపి: టంగుటూరు మండలం తాళ్లపాలెంలో రొయ్యల చెరువుకు కాపుల ఉంటున్న రమేష్ మల్లి అనే యువకుడు విద్యుత్ షాక్తో మృతి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తాళ్లపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రమేష్ మల్లిక్ అనే యువకుడు విద్యుత్ షాక్తో శుక్రవారం మృతి చెందాడు. కొంతకాలంగా రొయ్యల చెరువుకు కాపులా ఉంటున్న యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు స్థానిక ఆసుపత్రికి తరలించామని విచారణ అనంతరం పూర్త వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.