జహీరాబాద్: ఉద్యోగం పేరుతో మహిళకు టోకరా, నగదు కాజేసిన సైబర్ మోసగాడు
ఉద్యోగం పేరుతో మహిళను మోసం చేసి డబ్బులు దండుకున్న సంఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని అభ్యంద గ్రామానికి చెందిన భాగ్యశ్రీ అనే యువతి ఇంస్టాగ్రామ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ చూసి దరఖాస్తు సమర్పించి సంబంధిత వ్యక్తితో మాట్లాడి వివిధ ఫీజుల నిమిత్తం 12,500 నగదు చెల్లించింది. డబ్బులు తీసుకున్న వ్యక్తికి ఫోన్ చేయగా జహీరాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం కలుస్తానని చెప్పి మోసం చేసినట్లు పేర్కొంది. శుక్రవారం మధ్యాహ్నం బాధిత యువతి రైల్వేస్టేషన్లో వ్యక్తి వివరాల కోసం సంప్రదించగా ఆ వ్యక్తి మోసం చేసినట్లు తెలిసింది, దీంతో మహిళ మోసానికి గురైనట్లు ఆవేదన వ్యక్తం చేసింది.